రివ్యూ:ఎంఎల్‌ఎ

349
- Advertisement -

నందమూరి యంగ్‌ హీరో కళ్యాణ్‌ రామ్‌-కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ఎంఎల్‌ఎ. పటాస్‌ తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్…పూర్తి నమ్మకంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో లేదా చూద్దాం…

కథ:

కల్యాణ్‌(కల్యాణ్‌రామ్‌) ..ఇందు(కాజల్‌)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఇందు కల్యాణ్‌ నుంచి తప్పించుకుని తిరుగుతుంది. ఈ క్రమంలో ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి ఇందును రక్షిస్తాడు. ఈ క్రమంలో ఇందు కూడా కల్యాణ్ ప్రేమలో పడుతుంది. అయితే ఇందు తండ్రి మాత్రం ఎమ్ముల్యేని తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు.ఈ క్రమంలో కల్యాణ్‌ వచ్చి ఇందుని ప్రేమిస్తున్నానంటాడు. ఎమ్మెల్యే అయితే పెళ్లి చేస్తానని ఇందు తండ్రి చెప్పడంతో ఛాలెంజ్‌కి దిగుతాడు కల్యాణ్. మరి ఆ ఛాలెంజ్‌లో నెగ్గాడా..? ఇందుని పెళ్లి చేసుకున్నాడా? లేదా అన్నది తెరమీద చూడాల్సిందే.

MLA -Kalyan Ram movie Review

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కామెడీ,కమర్షియల్ అంశాలు,నిర్మాణ విలువలు,నేపథ్య సంగీతం. కల్యాణ్ రామ్ తన అద్భత నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. కామెడీ, భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు మరో అట్రాక్షన్ కాజల్. ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కడంతో కాజల్ తననటనతో ఆకట్టుకుంది. విలన్‌గా రవికిషన్‌ మెప్పించాడు. వెన్నెల కిశోర్‌, పృథ్వీ ,పోసాని కృష్ణమురళి తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరి,బోర్ కొట్టించే సన్నివేశాలు. చాలా సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయి. ఫస్ట్‌ హాఫ్ అంతా అసలు కథతో సంబంధం ఉండదు. హీరో ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యేందుకు చేసే ప్రయత్నాలు ఇంకాస్త ఎలివేట్‌ చేసుంటే బాగుండేదనిపించింది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. మణిశర్మ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. దర్శకుడికి ఇది తొలి సినిమా .కాబట్టి ప్రయోగాల జోలికి పోలేదు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.

MLA -Kalyan Ram movie Review

తీర్పు:

కెరీర్ ప్రారంభం నుంచి కమర్షియల్‌ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన హీరో కల్యాణ్‌ రామ్‌. తాజాగా మరోసారి అలాంటి కథతో ‘ఎం.ఎల్‌.ఎ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీ,కమర్షియల్ అంశాలు,నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ కాగా రొటీన్ స్టోరీ,బోర్ కొట్టించే సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా పటాస్‌ తర్వాత అందరికి నచ్చే కల్యాణ్ రామ్ మార్క్ మూవీ ఎంఎల్ఎ.

విడుదల తేదీ:23/03/2018
రేటింగ్‌:2.75 /5
నటీనటులు: కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, విశ్వ ప్రసాద్‌
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్‌

- Advertisement -