వెలుగు జిలుగుల తెలంగాణ: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

511
jeevan reddy
- Advertisement -

కరెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్రమే చెప్తోందన్నారు పీయూసీ ఛైర్మన్,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అసెంబ్లీ హాల్ లో పీయూసీ సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన… పియూసీ సమావేశం సుదీర్ఘంగా నాలుగు గంటలు జరిగింది…. చీకటిలో ఉన్న తెలంగాణను…వెళుతులోకి కేసీఆర్ తెచ్చారన్నారు.

7వేల మెగావాట్స్ ఉత్పత్తి ని…16వేల కు పెంచడం….గతంలో కరెంట్ ఉంటే న్యూస్ అయితే…ఇప్పుడు కరెంట్ పోతే న్యూస్ అవుతుందన్నారు. అంధకారంలో ఉన్న రైతులకు వెళుతురులు కేసీఆర్ నింపారని చెప్పారు. రైతులు అడిగిన 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్స్ కేసీఆర్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. తెలంగాణ సొంత రాష్ట్రంలో తలసరి వినియోగం ఒక వ్యక్తి 2వేల యూనిట్లు వాడుతున్నారు….. 29వేల కోట్లు ఖర్చు చేస్తే…కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాలేదన్నారు. నా నియోజవర్గంలోనే 9 సబ్ స్టేషన్స్ కొత్తగా వచ్చాయి…. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళలో సర్ ప్లేస్ కరెంట్ తెచ్చిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు.

కరెంట్ విషయంలో 2014కు ముందు ఉన్న పరిస్థితి…2021 పరిస్థితి కి భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉందన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. విద్యుత్ ఉత్పత్తి పుష్కలంగా ఉంది కాబట్టి అనేక పరిశ్రమలు వస్తున్నాయి….. విద్యుత్ ఉత్పత్తి గొప్పగా జరుగుతోంది కబాటే తెలంగాణ అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. కేసీఆర్ ప్రణాళికల వల్లే విద్యుత్ సమస్యలు లేవన్నారు.

- Advertisement -