పవర్‌తో పెట్టుకోకండి…బీజేపీపై జీవన్ రెడ్డి ఫైర్

635
trs jeevan reddy
- Advertisement -

కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు పై సీఎం కెసిఆర్ తీసుకున్న వైఖరి పై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. హైదరాబాద్ టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని పార్టీలు ఎన్నికలప్పుడు రైతుల గురించి మాట్లాడుతుంటాయి ఎపుడూ రైతులకు మేలు తలపెట్టేది టీఆర్ఎస్‌ మాత్రమేనన్నారు.

రైతులకు విద్యుత్ తొలగించేందుకే మోడీ విద్యుత్ బిల్లు ను తెస్తున్నారని…..పవర్ తో పెట్టుకున్నోళ్ళు పవర్ లేకుండా పోయారన్నారు. చంద్రబాబు కరెంటు తో పెట్టుకుంటే కుర్చీ పోయింది……వైఎస్ కు రెండు సార్లు పవర్ తెచ్చింది పవరేనని గుర్తుచేశారు.

ఫెడరల్ స్ఫూర్తి ని మోడీ ని మంట గలుపుతున్నారని…..కేంద్రీకృత విద్యుత్ చట్టం పై మోడీ చూపిన శ్రద్దను వలస కార్మికుల పై చూప లేకపోయారని విమర్శించారు. వలస కార్మికుల ఉసురు మోడీ కి తగులుతుందని……మోడీ కి ధైర్యం ఉంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వం సబ్సిడీలు ఇవ్వం అని బహిరంగంగా చెప్పాలన్నారు.

30 శాతం వలస కార్మికుల ఉసురు తగిన మోడీ కి 70 శాతం రైతుల ఉసురు కూడా తప్పదని..కేసీఆర్ విధానాల వల్లే తెలంగాణ లో రికార్డు స్థాయి ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. కేసీఆర్ ఉచిత విద్యుత్ దేశానికే ఆదర్శం అని……కేంద్రం అంటే బీజేపీ జాగీరా ? అని ప్రశ్నించారు. బీజేపీ అంటే భారతీయ బోగస్ పార్టీ …..కేంద్రం లో మోడీ… లోకల్ గా బీజేపీ కేడీ లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టిన జీవన్ రెడ్డి..దమ్ముంటే బీజేపీ స్థానిక కేడీ లు పసుపు బోర్డు తేవాలన్నారు.

మా నిజామాబాద్ ఎంపీ ఓ ఫేక్ ఎంపీ……బోగస్ డిగ్రీ తెచ్చుకున్న ఎంపీ మా నిజామాబాద్ ఎంపీ అని విమర్శించారు. తెలంగాణ మీద ప్రేముంటే బీజేపీ నేతలు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇప్పించాలని… .మిషన్ భగీరథ కు డబ్బులు తెప్పించాలన్నారు. సంక్షేమం అంటే మోడీకి పడదని……ఒక్క సంక్షేమ పథకం కూడా మోడీ హాయం లో అమలు జరగలేదన్నారు. కేంద్రం నిధుల గురించి బీజేపీ నేతలు జబ్బలు చరచుకుంటున్నారు ……బీజేపీ నేతలకు నెత్తి లేదు కత్తి లేదు .ఏదీ పడితే అది మాట్లాడుతున్నారన్నారు.
ఇప్పటికైనా మోడీ విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలి ….లేకపోతే బీజేపీ కి మిగిలేది గుండు సున్నే అని జోస్యం చెప్పారు.

- Advertisement -