మేం దాడులు చేస్తే తట్టుకోగలరా?: జీవన్ రెడ్డి

98
jeevan
- Advertisement -

బీజేపీ తీరు మార్చుకోకుంటే రానున్న రోజుల్లో తాము కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ఇళ్లపై దాడులు చేయాల్సి వస్తదని హెచ్చరించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించడాన్ని తీవ్రంగా ఖండించారు.

దొంగే దొంగ అన్నట్లుగా వాళ్లే దాడి చేస్తారు..ఇదెక్కడి తీరు అని ప్రశ్నించారు. తెలంగాణ బతుకమ్మ కవితక్క జోలికి వస్తే బీజేపీ బతుకులు ఆగం అవుతాయని మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను చీల్చడానికే కేంద్రం ఈడీ, ఐటి, సీబీఐ లను వాడుతోందన్నారు. మోడీ ఈడీ, అమిత్ షా ఐటీ ఇజంకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ కుటుంబంలో నేతలంతా ప్రజల్లోంచి వచ్చారని..లిక్కర్ స్కాం కేసులో ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని కవిత ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన్నప్పటి నుంచి జరగని ఈడీ సోదాలు మోడీ పాలనలో జరుగుతున్నాయన్నారు.

- Advertisement -