ఎంపీ అరవింద్‌ రైతు ద్రోహి- ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

255
- Advertisement -

మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీ అరవింద్‌ పర్యటిస్తుండగా.. పసుపు రైతులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తేకుండా మోసం చేశాడని రైతులు మండిపడ్డారు. మామిడిపల్లి గ్రామంలో అరవింద్‌ రాసిచ్చిన బాండ్‌ పేపర్‌ చూపిస్తు రైతులు ఆందోళన చేశారు. దీంతో ఎంపీ అరవింద్‌ వెనుదిరిగి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు.

అయితే ఈ ఘటనపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి స్పందించారు. ఎంపీ అరవింద్‌ను అడ్డుకున్నది టీఆర్ఎస్ శ్రేణులు కాదు..పసుపు రైతులు అని అన్నారు. రైతులకు సమాధానం చెప్పలేకనే మామిడిపల్లి నడిరోడ్డుపై నాటకాలు చేస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రైతుల ముందుకెళ్లే ధైర్యం లేక టీఆర్ఎస్‌పై అక్కసు చూపిస్తున్నారు. టీఆర్ఎస్‌ను విమర్శించేముందు ఎంపీ అరవింద్ రైతులకు సమాధానం చెప్పాలి.

ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని చెప్పావా?లేదా?.. పసుపుబోర్డు తేలేకపోతే రాజీనామా చేసి రైతుల ఉద్యమంలో పాల్గొంటానని బాండ్ పేపర్ రాసిచ్చావా?లేదా?.. మూడేళ్లు కావస్తున్నా పసుపు బోర్డు తేలేని నువ్వు దద్దమ్మవి..చవటవి అవునా?కాదా? అని ప్రశ్నించారు. రైతులను నట్టేట్లో ముంచిన అరవింద్ ఒక నయవంచకుడు.. కపట మాటల పగటి వేషగాడు అని ఎమ్మెల్యే మండిపడ్డారు.

రైతు ద్రోహి..నిజామాబాద్ జిల్లాకు పట్టిన అష్టదరిద్రం..ఐదేళ్ల శని అని దుయ్యబట్టారు. పసుపుబోర్డు తేకుండా అరవింద్ ఏ గ్రామంలో అడుగుపెట్టలేడు. రైతుల దృష్టి మళ్లించడానికే కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాడు అరవింద్. కేసీఆర్ జోలికొస్తే బోడిగుండు అరవింద్‌ను బొందపెడతమని ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -