- Advertisement -
సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. భూదాన్ ఉద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి చేపట్టిన ఈ పాదయాత్ర భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలోని వర్ధా వరకు సాగనుంది.
మెదక్ జిల్లాలోని మాసాయిపేట నుండి చేగుంట వరకు సాగగా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు జగ్గారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన జగ్గారెడ్డి… భూదానోద్యమం జరిగి 75 ఏళ్ళు పూర్తయిన చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.
ఆ రోజు గాంధీజీ పిలుపు మేరకు వేల ఎకరాలు భూములను స్వచ్ఛందంగా దానం చేసి, భూములు లేని నిరుపేదలకు పంచారన్నారు. వేలాదిమంది మంది నిరుపేదలకు ఉపయోగపడ్డ భూదానోద్యమాన్ని గుర్తు చేస్తూ పాదయాత్ర చేపట్టామన్నారు.
- Advertisement -