కాంగ్రెస్‌లోనే ఉంటా…నేనంటే వారికి భయం: జగ్గారెడ్డి

130
jaggareddy
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సీనియర్ నేత జగ్గారెడ్డికి ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డికి ఉన్న పదవులన్నింటికి కోత పెట్టగా ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు.

భట్టి, ఉత్తమ్‌ సహా ఎవరూ తనతో మాట్లాడట్లేదని ఇప్పుడున్న పరిస్థితుల్లో నాతో మాట్లాడేందుకు భయపడుతున్నట్లున్నారని తెలిపారు. జగ్గారెడ్డి అంటే ఏంటో రేవంత్‌కు తెలియాలన్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని సమర్థిస్తానని… పదవుల కోత అనేది కూడా స్పోర్టివ్‌గా తీసుకుంటానని వెల్లడించారు.

- Advertisement -