సిద్దిపేట జిల్లాలో నేడు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట మండలం ఇరుకోడ్ గ్రామంలో రెడ్డి, గౌడ, రజక సంఘ భవనాలు, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఓట్లు ఉన్నప్పుడు వచ్చేవాళ్లు నాయకుడు కాదు..ఐదు ఏళ్లు ప్రజల మధ్య ఉండి పనిచేసేటోళ్లే అసలైన నాయకులు అన్నారు.
ఇరుకోడ్ గ్రామం చుట్టు ఉన్న మూడు గ్రామాలకు ప్రత్యేకంగా ఇరిగేషన్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. యాదవులకు త్వరలోనే రెండవ విడత గొర్రెల పంపిణి చేస్తామని హామి ఇచ్చారు. యువత తాగుడు, సెల్ ఫోల్ లకు బానిసలుగా మారుతున్నారని..సెల్ ఫోన్ వాడటం తగ్గించాలని సూచించారు. రైతులు ఎప్పటికి ఒకే రకమైన పంటలు కాకుండా కమర్షియల్ పంటలు పండించాలన్నారు.
సిద్దిపేట జిల్లాలో త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఇరుకోడ్ లో త్వరలోనే పశువుల దవాఖాన, శ్మశాన వాటిక కోసం నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే ఇరుకోడ్ నుంచి సిద్దిపేట్ వరకూ ఫోర్ లైన్ రోడ్, బ్లాటర్ ప్లై లైట్స్ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఇరుకోడ్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలని తెలిపారు.