మత్సకారులకు ఇక మంచి రోజులు..

412
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ,చింతల చెరువుల్లో 1.70 వేల వంద శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ పాల్గొని చేప పిల్లలను అందించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ:మత్సకారుల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చెరువుల్లో చేపలను పంపిణీ చేస్తుంది.గతంలో నియోజకవర్గంలోని ఒకటి, రెండు చెరువుల్లో మాత్రమే సబ్సిడీతో పంపిణీ చేసేవారు.ఈ ఏడాది సరైన వర్షాలు కురవక చెరువుల్లో నీరు లేక చేపలు పంపిణీ ఆలస్యం అయింది.నెల రోజుల్లో రంగనాయక సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నింపి, వాటిలో కూడా చేపలను వదులతామని హరీష్‌ రావు తెలిపారు.

harish

మత్స శాఖ అధికారులు కావాల్సిన చేప పిల్లలను సిద్ధంగా ఉంచాలి.దసరా నాటికి అన్ని చెరువులు కుంటలు నింపి చేపలు వదులుతాం.మత్సకారులకు మంచి రోజులు రాబోతున్నాయి, వారి మొఖంలో సంతోషం చూస్తాం.మత్సకారులు ఆకాశం వైపు మొఖం పెట్టి చూడకుండా కాళేశ్వరం నీళ్లతో చెరువులు నింపుతాం. మత్సకారులు దళారులను ఆశ్రయించకుండా వ్యాపారం కూడా చేసుకొని తమ కాళ్ళమీద తామే నిలబడాలి.మత్సకారులకు కావాల్సిన ఆటోలు, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం.సిద్దిపేటలో గతంలో కంటే చేపల మార్కెటింగ్ బాగా పెరిగింది, భవిష్యత్‌లో సిద్దిపేటలో మంచి మార్కెట్ ఉంటుందని అని ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు.

- Advertisement -