కాంగ్రెస్ పార్టీలో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీలో చేరగా తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హస్తం గూటికి చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గాంధీతో పాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన వారి సంఖ్య 9కి చేరింది. .
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరారు.
Also Read:Sachin:అండర్సన్‌కు విషెస్ చెప్పిన సచిన్