రేవంత్ రెడ్డి తెలంగాణ చీటర్స్ కమిటీ అధ్యక్షుడు అని ఎమ్మెల్యే గాదరి కిశోర్ మండిపడ్డారు. ఈరోజు ఆయన హైదరాబాద్ టిఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ మాటలతో ఇండియాకు వాళ్లే ఇద్దరు గాడిదలు అని వాళ్ళ నాయకులే అంటున్నారు. రేవంత్ రెడ్డి నా బొచ్చుగానితో సమానం అని నేను కూడా అనగలుగుతా! కానీ మాకు సంస్కారం ఉంది. రేవంత్‌లా చిల్లర రాజకీయాలు చేయడం లేదు అన్నారు. రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.గాడిదకు మూలాలు తెలుసు కాబట్టే గాడిదలా మాట్లాడుతున్నారని.. ఆ పార్టీ వాళ్లే అంటున్నారన్నారు.రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని విమర్శించారు. తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అంతేనన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆరెస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సర్వనాశనం- ఎమ్మెల్యే గాదరి
- Advertisement -
- Advertisement -