కేసీఆర్ బర్త్‌డే.. ఓయూలో రక్తదాన శిబిరం..

73
- Advertisement -

తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజును పురస్కరించుకుని ఓయూలో టీఆర్ఎస్ విద్యార్ధి, యూత్ విభాగాల ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ విభాగం, టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర నాయకులు ధర్మేంధర్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ,పడాల సతీష్, రవి, కిరణ్ గౌడ్, నాగారం ప్రశాంత్, జిల్లా శంకర్, శ్రీకాంత్ గౌడ్, శాగంటి రాములు, కిశోర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -