- Advertisement -
ఈ రోజు గాంధీ భవన్లో ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీ.కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మండిపడ్డారు. తనకు చెప్పకుండానే కత్తి వెంకటస్వామిని నర్సంపేట కాంగ్రెస్ నేతగా పరిచయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు వేల ఓట్లు కూడా సంపాదించని నేతకు…నాతో సమానమైన హోదా ఎలా కల్పిస్తారని మాధవ రెడ్డి మండిపడ్డారు. ‘నీ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతోంది’ అంటూ నిప్పులు చెరిగారు. శనివారం గాంధీ భవన్లో ఏఐసీసీ కార్యదర్శుల సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు ఉత్తమ్ తీరుపై తీవ్రస్థాయిలో దొంతి మాధవ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -