హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజవర్గం సింగాడ బస్తి,జాహ్రా నగర్,గౌరీశంకర్ కాలనీ,దేవరకొండ బస్తీ లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దానం….ఈ రోజు 35 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశాం…సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి ఇస్తున్నామన్నారు.
పేదింటి ఆడపిల్లల కు పెండ్లి భారం కాకూడదని ఇలాంటి కార్యక్రమము చేపట్టిన ముఖ్యమంత్రి కి లబ్ధిదారులు కృతజ్ఞతలు చెపుతున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ని ఎప్పుడు చూడలేదని ఇలాంటి ముఖ్యమంత్రి రావడం ఆనందంగా ఉందని లబ్దిదారులు అంటున్నారని తెలిపారు. రైతు బంధు సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి చెక్కులు అందుతున్నాయని…హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో మంత్రి కేటీఆర్ తీవ్ర కృషి చేస్తున్నారన్నారు. టెస్లా కంపెనీ మా వద్ద రావాలని ఎలెన్ మాస్క్ ని ఆహ్వానించడం తో చాలా రాష్ట్రాలు పోటీ పడి ముందుకు వచ్చి కెటిఆర్ బాటలో నడుస్తున్నాయన్నారు. కేటీఆర్ ముందు చూపుతో హైదరాబాద్ అభివృద్ధి పథం లో ముందుకు వెళుతుందన్నారు.
చినజీయర్ స్వామి మీద ప్రతి పక్షాలు రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. చినజీయర్ స్వామి తలపెట్టిన యజ్ఞం దేశంలోనే ప్రతిష్టాత్మకమైనది ఇలాంటి కార్యక్రమము మీద చిల్లర వాక్యాలు చేయడం సరికాదు ఇప్పటికైనా మానుకోవాలన్నారు.

