పుట్టినరోజున మొక్కలు నాటిన ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ..

168
MLA Banoth Haripriya
- Advertisement -

ఇల్లందు నియోజక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గ శాసన సభ్యుల వారి కార్యాలయం నందు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ ఇప్పటికే కొన్ని లక్షల మొక్కలు నటించడం అనేది గొప్ప విషయం అన్నారు. అంతేకాకుండా మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని అదేవిధంగా నాటిన మొక్క యొక్క సంరక్షణ బాధ్యత కూడా వారి మీదే ఉందన్నారు. ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఇల్లందు నియోజక వర్గ వ్యాప్తంగా మొక్కలు నాటి యావత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే పచ్చదనంగా మార్చాలని జోగినిపల్లి సంతోష్ కుమార్ కలని సాకారం చేయాలని యువతకు పిలుపునివ్వడం జరిగింది.

అంతేకాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవితను అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యను ఈ గ్రీన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ వారు కూడా తన ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరడం జరిగింది. అంతేకాకుండా తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ కార్యక్రమంలో భాగంగా మీ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -