గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే బాల్క సుమన్..

43

ప్రభుత్వ విప్,చెన్నూర్ శాసన సభ్యులు బాల్క సుమన్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని బాల్క సుమన్‌ను కోరారు.

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు హనుమకొండ జిల్లా కమలపూర్ మండల కేంద్రంలో మొక్కలు నాటారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.