ధర్మపురి అరవింద్ వీధి రౌడీలా మాట్లాడుతున్నాడు-ఎమ్మెల్యే

244
Bajireddy Govardhan Reddy
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వీధి రౌడీల్లా మాట్లాడుతున్నాడు. మెంబర్ అఫ్ పార్లమెంట్ కాకుండా మెంబర్ అఫ్ పంచాయతీగా మాట్లాడుతున్నాడని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై గురువారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అరవింద్ అబద్దాలను ప్రచారం చేస్తున్నాడు. ప్రజలకు ప్రలోభాలు పెట్టి పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నాడని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు.

దుబ్బాకలో తప్పుడు ప్రచారం చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు సంక్షేమ, ఫలాలు బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కడైనా అమలు అవుతున్నాయో బిజెపి నాయకులు చెప్పాలన్నారు. వ్యక్తిగతంగా నాపై తప్పుడు ప్రచారం చేసినందుకు అరవింద్ పైన పరువు నష్టం దావా వేస్తా. 35 ఏళ్ల నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

- Advertisement -