మొక్కలు నాటిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..

33
GIC

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్టీసీ ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ రాష్ట్ర దేశ వ్యాప్తంగా కోట్ల మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. మొక్కలు నాటడం వలనా ప్రజలకు జీవనానికి ఎంతో మేలు జరుగుతుంది. హరితహారం గ్రీన్ ఛాలెంజ్ ద్వారా ప్రతి ఏటా కోట్లాది మొక్కలను నాటడం జరుగుతున్నదన్నారు.

పల్లెల్లో పచ్చదనాన్ని నింపేందుకు ఇంటింటికీ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు గ్రామస్తులకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుంది.. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఈ కార్యక్రమంలో బస్ భవన్ ఎస్క్యూటర్ డైరెక్టర్ రెవిన్యూ పురుషోత్తం,ఎస్క్యూట్ ఇంజనీర్ రామ్మోహన్ రావు,చీఫ్ ఇంజనీర్ రాంప్రసాద్ అండ్ పార్టీ కార్యకర్తలు పాలుగున్నారు.