- Advertisement -
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో విజయనగరం ఎమ్మెల్సీ రంగరాజు., పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు., తెలంగాణ ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ., ప్రభుత్వ సలహా దారుడు అజయ్ కల్లమ్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా… దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
- Advertisement -