పవన్‌ సినిమాలు ఆడనివ్వం!

8
- Advertisement -

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కు హెచ్చరిక జారీ చేస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇకపై జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు తాను ఆడనివ్వబోనని స్పష్టం చేశారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

“పవన్ కళ్యాణ్ నన్నేం పీకుతారని అనుకోను. క్షమాపణలు చెప్పడం లేదు, కనీసం స్పందించడమూ లేదు. ఇది ఆయన అహంకారం” అంటూ అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంపై ఎవరైనా విమర్శలు చేస్తే తప్పకుండా రియాక్ట్ అవుతానని ఆయన చెప్పడం గమనార్హం.

అలాగే, ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే, వారు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తప్పకుండా స్పందించాల్సిన అవసరముందని అన్నారు. “తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడేటప్పుడు, బయటివాళ్లు చేసే వ్యాఖ్యలపై ప్రతి నేత కూడా స్పందించాలని నేను భావిస్తున్నాను” అని అనిరుధ్ రెడ్డి అన్నారు.

ఈ వ్యాఖ్యలతో జడ్చర్లలో రాజకీయ వేడి ಮತ್ತింత పెరిగింది. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? లేక ఈ వార్నింగ్‌తోనే కాంగ్రెస్–జనసేన మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతుందా? అనే ప్రశ్నలు వేడెక్కుతున్నాయి.

Also Read:సమంత రెండో పెళ్లిపై సద్నా సింగ్

- Advertisement -