ఎపీ అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పదేపదే అడ్డుకుంటున్నారన్న కారణంతో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను సస్పెండ్ చేశారు. అయితే అసెంబ్లీ ఆవరణలో సస్పెండైన ఎమ్మెల్యేలతో ముచ్చటించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
గత ఐదేండ్లలో మార్షల్స్ ఎప్పుడు సభ లోపలికి రాలేదని గోరంట్ల చైదరి అంబటితో చెప్పగా..సస్పెండైన సంగతి తనకు తెలియదని తాను ఇప్పుడే అసెంబ్లీకి వస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత వారి ముగ్గురికి కంగ్రాట్స్ చెప్పారు అంబటి. మా ముగ్గురిని సెషన్ మొత్తం సస్పెన్షన్ చేశారనగా అంబటి మాట్లాడుతూ.. 40రోజుల్లోనే సస్పెండయ్యేలా గొడవ చేయడం ఎందుకంటూ బుచ్చయ్య చౌదరికి కౌంటర్ ఇచ్చారు. సరే ఇక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కలుద్దామంటూ లోపలికి వెళ్లిపోయారు అంబటి రాంబాబు.