173 మందితో డీఎంకే జాబితా రిలీజ్..

165
stalin
- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 173 మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది డీఎంకే. ఈ సారి ఎన్నికల్లో స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్టాలిన్ …కోలాథూర్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలువనుండగా.. ఉదయనిధి స్టాలిన్‌ చెపాక్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్టాలిన్‌ ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు.

234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 61 సీట్లు కూటమి కేటాయించగా.. మిగతా 173 స్థానాల్లో డీఎంకే పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. మాజీ మంత్రులు అలాడి అరుణ, సురేష్‌ రాజన్‌, కన్నప్పన్‌, మాజీ స్పీకర్‌ అవుడియ్యప్పన్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

చెపాక్ నుండి ఉదయనిధి స్టాలిన్ తాత,మాజీ సీఎం కరుణానిధి మూడుసార్లు విజయం సాధించారు. ఇక్కడ డీఎంకేకు మంచి పట్టుంది.

- Advertisement -