మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొనసాగుతునే ఉన్నాయి. రెండు దశాబ్దల క్రితం అక్బర్ తనను రేప్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది.20 సంవత్సరాల క్రితం అక్బర్ ఏషియన్ ఏజ్ ఎడిటర్‌గా ఉన్న సమయంలో తాను జర్నలిస్ట్‌గా చేరానని, ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనను లొంగదీసుకున్నారని ఆరోపించారు.
ఓ ఆర్టికల్‌ను అక్బర్ చూపించడానికి వెళ్లినపుడు ఆయన ఎంతగానో మెచ్చుకున్నారని …అయితే ఆ వెంటనే ఆయన ప్రవర్తన మారిపోయిందని, తనకు ముద్దివ్వాల్సిందిగా వేధించారని వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన ఆర్టికల్‌లో తెలిపింది. దీంతో ఆయనను బలవంతంగా వదిలించుకొని బయటకు వచ్చేశానని ఆమె తెలిపారు. తర్వాత ముంబైలోని ఓ హోటల్లో అక్బర్ మరోసారి తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారని చెప్పింది.
Those before me have given me the courage to reach into the recesses of my mind and confront the monster that I escaped from decades ago. Together, our voices tell a different truth @TushitaPatel @SuparnaSharma @priyaramani @ghazalawahab
My story https://t.co/DG5dT7TEUU— Pallavi Gogoi (@pgogoi) November 1, 2018
తర్వాత జైపూర్ హోటల్లో ఓ స్టోరీ గురించి చర్చించడానికి పిలిచి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆర్టికల్‌లో తెలిపింది. కొన్ని నెలల పాటు తనను మానసికంగా, శారీరకంగా అక్బర్ వేధిస్తూనే ఉన్నారని, తాను పూర్తిగా నిస్సహాయురాలిగా మారిపోయానని పల్లవి ఆరోపించింది. తాను లండన్ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత కూడా అక్బర్ వదల్లేదని, అక్కడికి కూడా వచ్చి వేధించారని తనలాగే ఆయన చేతుల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు మద్దతుగా ఇప్పుడు తానిదంతా రాస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.