శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన మిక్చర్ పొట్లం చిత్రం ఈనెల 19న రిలీజ్ కి సిద్ధమైంది . సీనియర్ నటుడు భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా పరిచయం అవుతున్నాడు ఈ మిక్చర్ పొట్లం చిత్రంతో . గీతాంజలి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం వి సతీష్ కుమార్ దర్శకత్వం వహించగా గోదావరి సినీ టోన్ పతాకంపై కలపటపు లక్ష్మీ ప్రసాద్ , కంటే వీరన్న చౌదరీ , లంకపల్లి శ్రీనివాసరావు లు సంయుక్తంగా నిర్మించారు . వెటరన్ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం .
మిక్చర్ పొట్లం రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో చెన్నై లో ఈ చిత్ర ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు . ఈ షో ని చూసినవాళ్లలో దర్శకులు , నటులు కే భాగ్యరాజా దంపతులు , మాజీ హీరోయిన్ లిజి , భానుచందర్ , ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , చారుహాసన్ ,వెన్నెలకంటి తదితరులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు . మిక్చర్ పొట్లం ని చూసిన భాగ్యరాజా , ఎస్పీ బాలు , లిజి , చారుహాసన్ లు అభినందనలతో ముంచెత్తారు . మిక్చర్ పొట్లం సినిమా చాలా బాగుందని తప్పకుండా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు అందజేశారు .
చిత్ర నిర్మాతలు కలపటపు లక్ష్మీప్రసాద్ ,కంటే వీరన్న చౌదరి , లంకపల్లి శ్రీనివాసరావు లు మాట్లాడుతూ ‘ ‘ మిక్చర్ పొట్లం తో తొలి ప్రయత్నంగా చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చామని , అన్ని అంశాలతో ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా రూపొందిందని ……. మా మిక్చర్ పొట్లం ప్రీమియర్ షోకి కేరళ నుండి ప్రత్యేకంగా చెన్నై కి అది కూడా సతీసమేతంగా రావడం మా అదృష్టమని అలాగే భాగ్యరాజా గారికి మా సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు .
దర్శకులు ఎంవి సతీష్ మాట్లాడుతూ ” చెన్నై లో జరిగిన ప్రీమియర్ షోకి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని , అన్నింటికీ మించి సినిమా రంగంలో లెజెండ్స్ అయిన కే భాగ్యరాజా , చారుహాసన్ , మాజీ హీరోయిన్ లిజి లతో పాటు పలువురు సినీ ప్రముఖులు మా చిత్రాన్ని చూసి అభినందించడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ఈనెల 19న మిక్చర్ పొట్లం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు .
చెన్నై లో ‘మిక్చర్ పొట్లం’
- Advertisement -
- Advertisement -