టీమిండియా మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగులు సాధించి తొలి భారత మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. నిన్నటి వరకు ఆమె ఖాతాలో 9,965 పరుగులు ఉండేవి. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో ఆమె 35 పరుగులు చేయడంతో ఈ రికార్డు ఆమె సొంతమైంది. అనంతరం మరో పరుగు చేసిన తర్వాత ఆమె ఔట్ అయింది. 1999లో భారత మహిళా క్రికెట్లోకి అడుగుపెట్టిన మిథాలి రాజ్ ప్రపంచంలోనే మేటి మహిళా క్రికెటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.
ఆమె టెస్టుల్లో 10 మ్యాచులు ఆడి 663 పరుగులు, వన్డేల్లో 212 మ్యాచులు ఆడి 6,974, టీ20ల్లో 89 మ్యాచ్లు ఆడి 2,364 పరుగులు చేసింది. కాగా, ప్రపంచంలో 10,000 పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ 10,273 పరుగులతో అగ్రస్థానంలో ఉంది. ఆమె తర్వాతి స్థానంలో మిథాలి రాజ్ 10,001 పరుగులతో ఉంది.ప్రస్తుతం మిథాలి వన్డే కెరీర్లో మాత్రమే కొనసాగుతున్నారు.