కరోనా.. మిథాలీ రాజ్ 10 లక్షల విరాళం..

385
Mithali Raj
- Advertisement -

కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా చేస్తున్న పోరులో పలువురు ప్రముఖులు వారి సహకారాన్ని అందించడానకి ముందుకువస్తున్నారు.దేశంలోని ప్రముఖ క్రీడాకారులంతా తమ వంతు బాధ్యతగా వారికి తోచిన ఆర్థిక సాయం చేస్తున్నారు.. కరోనా సోకకుండా ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచిస్తూ.. ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా భారత మహిళల వన్డే టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ సాయం చేయడానికి ముందుకొచ్చింది.

కరోనాపై పోరాటానికి తన వంతుగా రూ. 10 లక్షల సాయం ప్రకటించి మంచి మనసు చాటుకుంది. ఈ మొత్తంలో ఐదు లక్షలు ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధికి, మరో ఐదు లక్షల రూపాయలు తెలంగాణ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్టు ప్రకటించింది.

‘ప్రాణాంతక కరోనా మహమ్మారిపై పోరాటంలో మనమంతా చేతులు కలపాలి. నా వంతు చిన్న సాయంగా పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 5 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 5 లక్షలు ఇస్తున్నా’ అని మిథాలీ ట్వీట్ చేసింది. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు, అజింక్యా రహానె, రోహిత్ శర్మ,పీవీ సింధు,పూనమ్ యాదవ్ విరాళాలు అందించారు.

- Advertisement -