రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,. ప్రియదర్శి తదితరులు మెయిన్ లీడ్ గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం `మిఠాయి`. ప్రశాంత్‌కుమార్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. ప్రత్యేకంగా వికారాబాద్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. అలాగే ఈ సినిమాతో పరిచయం కానున్న రాహి పోస్టర్ ను ఈ సందర్భం గా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా… చిత్ర దర్శక నిర్మాత ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “వికారాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో లిబరేషన్ సాంగ్‌ను చిత్రీకరించాం. దీంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నెల 17న సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. `పెళ్ళిచూపులు` సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. డార్క్ కామెడి జోనర్‌లో విభిన్నమైన క్యారెక్టర్స్ నడుమ సాగే సినిమా ఇది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తాం“ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: రవి వర్మన్. ఎన్ , ఎడిటింగ్: గ్యారీ. బి హెచ్ , కొరియోగ్రఫీ: అని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ వోడపల్లి.