‘మిస్టర్’ … ట్రైలర్ టాక్‌

122
Mister Theatrical Trailer

వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌’. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ ఇందులో హీరోయిన్స్. తాజాగా….. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ వదిలిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు.

విదేశాల్లోని అందమైన లొకేషన్స్ ఈ టీజర్ కి మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. “జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళుతుంది .. కానీ ప్రేమ .. జీవితం వున్న చోటుకే తీసుకెళ్తుంది”. అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్ బావుంది. “ఒక్కడు తోడుగా వుంటే చాలు .. వందమంది సైన్యంలా కాపాడతాడు” అంటూ లావణ్య త్రిపాఠి చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఈ టీజర్ అంచనాలను పెంచేదిగానే వుంది.

మెగా హీరో వరుణ్ తేజ్.. ఈ సినిమాలో మిగితా సినిమాల కంటే భిన్నంగా.. లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. క్లాస్ ఆండ్ డీసెంట్ లుక్స్ తో కనిపిస్తూనే మాస్ ఫైట్లు కూడా చేసేస్తున్నాడు