మిస్టర్ బచ్చన్..లేటెస్ట్ అప్డేట్.!

16
- Advertisement -

డెడ్లీ కాంబో కోసం గెట్ రెడీ. మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షనర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో రెండు బిగ్ ఫోర్సస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్‌’లో బిజిఎస్ట్ యాక్టర్స్ లో ఒకరైన జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

మిస్టర్ బచ్చన్‌ లో జగపతి బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుండగా తెరపై కన్నుల పండువగా ఉంటుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, అయనంక బోస్ కెమెరా డీవోపీగా పని చేస్తున్నారు.

ఈ సినిమాని మేకర్స్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. యూఎస్ లో కీలక షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం రైడ్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Also Read:హైదరాబాద్‌కు షాకిచ్చిన ముంబై..

- Advertisement -