టామ్ క్రూయిజ్ చివరిసారి నటించిన Mission: Impossible – The Final Reckoning మళ్లీ వార్తల్లో నిలిచింది. 2025 మేలో విడుదలై మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, హాలీవుడ్‌లోని అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీలలో ఒకదానికి ముగింపు పలికింది. ఇప్పుడు ఈ సినిమా భారత OTTలో అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమా 2025 ఆగస్టులో Amazon Prime Video మరియు BMS Streamలో కనిపించింది, కానీ అప్పుడు అది రెంటల్ వెర్షన్ మాత్రమే. చూసేందుకు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు Amazon Prime Video ఈ చిత్రాన్ని తమ రెగ్యులర్ లైబ్రరీలో చేర్చింది. అంటే ప్రైమ్ సభ్యులు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను ఉచితంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. రెంటల్ వెర్షన్‌ను స్కిప్ చేసి, ఫ్రీ OTT రిలీజ్ కోసం ఎదురు చూసినవారికి ఇది సరైన సమయం.
క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాన Mission Impossible టీమ్‌తో పాటు హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, హెన్రీ సెర్నీ, ఏంజెలా బాసెట్, ఎసై మొరేల్స్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
Also Read:నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్..

