యుఎస్‌లో ఆగని ‘మిస్ శెట్టి’

42
- Advertisement -

నవీన్ పొలిశెట్టి,అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ. ..యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకుందీ సినిమా. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా షోలు కూడా వేస్తున్నారు.

ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమా అదిరే వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకు యూఎస్ లో 1.4 మిలియన్ డాలర్స్ మార్క్ దాటింది. స్ట్రాంగ్ హోల్డ్ తో కొనసాగుతున్న ఈ చిత్రం 2 మిలియన్ డాలర్స్ ని త్వరలోనే క్రాస్ చేయనుంది.

ఈ సినిమాతో అనుష్కకి మంచి కమ్‌బ్యాక్ దొరకగగా హీరో నవీన్ మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రానికి రాధాన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

Also Read:ముందస్తు ఎలక్షన్స్.. జగన్ రెడీ !

- Advertisement -