ఆకట్టుకుంటున్న…‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్

44
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సందర్భంగా దర్శకుడు పి.మహేశ్ బాబు మాట్లాడుతూ – మా సినిమా ట్రైలర్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒక కొత్త కాంబినేషన్ లో నవీన్, అనుష్క, యూవీ క్రియేషన్స్, నేను కలిసి సినిమా చేశామంటే అందుకు ఇన్ స్పైర్ చేసింది కథే. రెండున్నర నిమిషాల ట్రైలర్ లో మేము కొంతే ఎంటర్ టైన్ చేయగలిగాం. రేపు థియేటర్ లో పూర్తి సినిమా చూస్తున్నప్పుడు కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తారు అని తెలిపారు.

నటుడు మహేశ్ ఆచంట మాట్లాడుతూ – జాతి రత్నాలు సినిమాలో అన్నతో కలిసి నటించాను. ఆ సినిమాకు నాకు మంచి పేరొచ్చింది. డైరెక్టర్ మహేశ్ అన్న నాకు రా..రా కృష్ణయ్య టైమ్ నుంచి తెలుసు. పదేళ్లుగా ఆయనను కలుస్తూనే ఉన్నాను. ఈ సినిమాలో నవీన్ అన్న ఎనర్జీ సర్ ప్రైజ్ చేస్తుందన్నారు. సినిమాలో అనుష్క చేసే రచ్చను చూస్తారు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ కెమిస్ట్రీ మీద రన్ అయ్యే సినిమా ఇది అన్నారు నవీన్ పొలిశెట్టి. గత రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ మీదే మేమంతా పనిచేశాం. సినిమాను అంతగా నమ్మాం. ఒక కథను మీ ముందుకు తీసుకువద్దామని నమ్మకంతో పనిచేశాం అన్నారు.

Also Read:ఉపేంద్ర గాడి అడ్డా..ప్రారంభం

- Advertisement -