వన్ మిలియన్ క్లబ్‌లో నవీన్ మూవీ!

11
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ మారుతి,హీరోయిన్ సమంత సినిమాపై ప్రశంసలు గుప్పించారు.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.తాజాగా ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ క్లబ్ లో చేరింది. అయితే నవీన్ కి యూఎస్ లో వన్ మిలియన్ క్లబ్ లో చేరిన మూడో చిత్రం ఇది. గతం లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు చిత్రాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి.

జయసుధ, మురళి శర్మ, భద్రం, అభినవ్ గోమతం, సోనియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Also Read:ఆగని జవాన్ సునామీ!

- Advertisement -