మిస్ హైదరాబాద్- 2018గా గౌరీప్రియ

283
- Advertisement -

“మిస్ హైదరాబాద్-2018” గా గౌరీప్రియ ఎంపికయ్యారు. విజేతగా గౌరీప్రియ ఎంపిక కాగా.. ఫస్ట్ రన్నరప్ గా అషిమా గౌతం, సెకండ్ రన్నరప్ గా రియా సింగ్ ఎంపికయ్యారు. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో జరిగిన హైదరాబాద్-2018 పోటీలు అందరిని ఆకట్టుకున్నాయి.

అందాల కిరీటం కోసం ర్యాంప్ పై ముద్దుగుమ్మలు హోయలు వలికిస్తూ పోటీపడ్డారు. అందం, అభినయం, ఆహార్యం తదితర అంశాలతో నిర్వహించిన ఈ పోటీలో అందాల కిరీటం కోసం 24 మంది అమ్మాయిలు పోటీపడ్డారు.

తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందగత్తెలు తమ అందచందాలతో కిరీటం కోసం నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డారు. వివిధ విభాగాల్లో సాగిన ఈ అందాల పోటీల కోసం డిజైనర్లు రూపొందించిన వస్త్రాల్లో అందాల భామలు మెరిసిపోయారు.

- Advertisement -