రివ్యూ: మిషన్ ఇంపాజిబుల్

409
mission imposible
- Advertisement -

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ RSJ దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమాతో తాప్సీ ఆకట్టుకుందా లేదా చూద్దాం…

కథ:

దేశంలో పిల్లల అక్రమ రవాణాపై దృష్టి సారించే పరిశోధనాత్మక జర్నలిస్ట్ శైలజ (తాప్సీ పన్ను) ఒక మాఫియా చేసిన చట్టవిరుద్ధమైన సంఘటనను బయటపెట్టాలనుకుంటుంది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుని ప్రభుత్వానికి లొంగిపోయేలా చేసి రివార్డ్ డబ్బును గెలవడానికి ముగ్గురు అల్లరి పల్లెటూరి కుర్రాళ్లు రఘుపతి (హర్ష్ రోషన్), రాఘవ (భాను ప్రకాష్) మరియు రాజారామ్ (జయతీర్థ మొలుగు) ఉండగా వారితో కలిసి దావూద్‌ను పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించారా, ఈ క్రమంలో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ కథ, తాప్సీ నటన,కామెడీ . శైలజ పాత్రలో ఒదిగిపోయింది తాప్సీ. తన పాత్రకు వందశాతం న్యాయం చేస్తూ సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లింది. కథలో భాగంగా ముగ్గురు అబ్బాయిలు అద్భుతంగా పనిచేశారు. తమ వయసుకు మించి నటనను కనబర్చారు. మిగితా నటీనటులు తమ పరిధిమేరకు నటించారు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలాబాగుంది. సెకండాఫ్‌లో సంగీతం కథాంశానికి తగ్గట్టుగా ఉండటం మరింత ఆకర్షణగా నిలిచింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

మిషన్ ఇంపాజిబుల్ అనేది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జే రాసి దర్శకత్వం వహించిన కల్పిత కథ. 2014లో న్యూఢిల్లీలో జరిగిన ఓ యదార్థ సంఘటనతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాప్సీ నటనతో పాటు ముగ్గురు అబ్బాయిల నటన సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లాయి. ఓవరాల్‌గా అందరికి నచ్చే సినిమా మిషన్ ఇంపాజిబుల్.

విడుదల తేది: 01/01/2022
రేటింగ్:2.75/5
నటీనటులు: తాప్సీ పన్ను, హర్ష్ రోషన్, భాను ప్రకాష్
సంగీతం – మార్క్ కె రాబిన్
నిర్మాతలు – నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం – స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే

- Advertisement -