Mirai:తేజ సజ్జా ‘మిరాయ్’ టీజ‌ర్‌

6
- Advertisement -

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం మిరాయ్. ఈ చిత్రంలో సూపర్ యోధాగా తేజ నటించనుండగా రితీకా నాయ‌క్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మ‌నోజ్ విల‌న్‌గా క‌నిపించ‌నుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. జ‌ర‌బోయేది మార‌ణ‌హోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం.. క‌లియుగంలో పుట్టిన ఏ శ‌క్తి దీన్ని ఆప‌లేదు అని జ‌య‌రాం చెప్పిన డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది.

మంచు మ‌నోజ్ – తేజ స‌జ్జా ఇద్దరు పోటీ పడి నటించగా టీజ‌ర్ చూస్తుంటే గూస్ బంప్స్ వ‌స్తున్నాయి. శ్రియ‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌రాం కీ రోల్ పోషిస్తున్నారు.

- Advertisement -