చానుకు స్వర్ణం..గురురాజాకు రజతం

244
Mirabai Chanu secured India’s first gold medal
- Advertisement -

కామన్వెల్త్ క్రీడల్లో తొలిరోజు భారత్ సత్తాచాటింది. భారత వెయిట్‌లిప్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకంతో సత్తాచాటగా..పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో గురురాజా భారత్‌కు రజత పతాకాన్ని అందించారు.

48 కిలోల విభాగంలో పోటీ పడిన మీరాబాయి మొత్తం 196 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి…. ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. తొలి ప్రయత్నంలో 80 కిలోల బరువెత్తిన చాను.. తర్వాతి ప్రయత్నాల్లో 84, 86 కిలోల బరువులెత్తింది. కామన్వెల్త్‌లో 77 కిలోల బరువెత్తడమే అత్యధికం కాగా.. 86 కిలోల బరువెత్తిన ఈ మణిపురీ అమ్మాయి కామన్వెల్త్ రికార్డును బ్రేక్ చేసింది.

gururaja

ఇక పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. కోచ్ స్పూర్తితోనే భారత్‌కు పతకాన్ని అందించగలిగానిన తెలిపాడు. రజత పతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు పోతానిన తెలిపాడు.

- Advertisement -