CMKCR:మైనారిటీల సంక్షేమమే తెలంగాణ లక్ష్యం..హ్యాపీ రంజాన్‌

27
- Advertisement -

యావత్తు ముస్లిం సహోదరులకు తెలంగాణ సీఎం కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ సహోదరత్వం దైవభక్తి ఆధ్యాత్మిక చింతన స్పూర్తితో ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకులను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం అన్నారు. అల్లా దీవెనలతో ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలన్నారు.

గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలమని లౌకికవాదాన్ని మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. విద్యా ఉపాధితో పాటు పలు రంగాల్లో ఆసరాను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు భరోసాగా నిలిచిందన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో మైనారిటీ సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.13వేల కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు.

మైనారిటీల అభివృద్ది కోసం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ప్రభుత్వ పథకాలను సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇందుకోసం తెలంగాణలో అమలవుతున్న మైనారిటీ పథకాలను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -