- Advertisement -
బల్గేరియా వేదికగా ఆదివారం జరిగిన మహిళల 52 కేజీల ఫైనల్లో తెలంగాణ స్టార్ నిఖత్ 4-1 తేడాతో టెటియానా కోబ్ (ఉక్రెయిన్)ను చిత్తు చేసి పసిడిని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిఖత్‌కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
2019 స్ట్రాంజా స్మారక టోర్నీలో స్వర్ణం చేజిక్కించుకున్న ఈ ఇందూరు చిచ్చర పిడుగు.. తన పిడిగుద్దులతో మరోసారి పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పసిడిని గెలుచుకుంది.
- Advertisement -