బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష..

596
Bathukamma Festival
- Advertisement -

సోమవారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ ఏర్పాట్లకు సంబందించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టూరిజం సెక్రటరీ పార్థసారధి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ప్రకృతిని పూజించే పండగ.ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది.ఆనాటి ప్రభుత్వ లు మన పండుగను పట్టించుకోలేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను కాపాడుకోవాలని మహిళలు పెద్ద ఎత్తున కృషి చేసారని మంత్రి అన్నారు.

 

జాగృతి ఆద్వర్యంలో బతుకమ్మ పండుగ ను దేశ విదేశాల జరుపుకోవడం జరిగింది.మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గత 5సంవత్సరం నుంచి అధికారికంగా జరుపుకుంటున్నము.ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా పండుగ చేస్తున్నారు.మహిళలకు సెలవులు కేటాయించడం జరుగుతుంది. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు ముంబాయి, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రల్లో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు.

minister srinivas

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ ప్రాంతంలో బతుకమ్మ పండుగను చేసుకోవాలి కోరుతున్న..ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగను అన్ని శాఖల అధికారుల సహాకారంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నెల 28న వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో 10వేల మందితో ఘనంగా ప్రారంభం అవుతుంది. 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ప్రాంతంలో ఘనంగా జరుగుతుందని మంత్రి తెలిపారు.

రాజ్ భవన్ ,అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది.ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ ను నిర్వహించడం జరుగుతుంది. అన్నీ రాష్ట్ర ల వారు బతుకమ్మ పండుగను జరుపుకుంటాం అంటున్నారు.వారికి ఎలాంటి సహాయం కావాలన్న అందిస్తాం. చివరాగ LB స్టేడియం నుంచి ట్యాంకు బండ్ వరకు ర్యాలీ ఉంటుంది. ముగింపు వేడుకలు ట్యాంకు బండ్‌లో జరుగుతాయని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు అయిన ఐదు సంవత్సరాలు నుంచి బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకుంటున్నాం.. ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. డబ్బు తో సంబంధము లేకుండా అన్ని పండుగ లను మన సంస్కృతి సంప్రదాయాలను తెలియ జేసే విదంగా ఘనంగా జరుపుతున్నాం అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

- Advertisement -