ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం- మంత్రి కేటీఆర్

312
ktr
- Advertisement -

హైద‌రాబాద్‌ నగరంలో గ‌త‌ వందేండ్ల‌ చరిత్రలో రికార్డుస్థాయి వ‌ర్ష‌పాతం నమోదై సంభవించిన వరదలతో నగరంలోని అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. వరద బాధితులకు తక్షణ సహాయ చర్యల్లో భాగంగా రేషన్ కిట్ల అందజేత, వైద్య శిబిరాలు, ఇతర తక్షణ సహాయాలు, వరద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది.

క్షేత్రస్థాయిలో యావత్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొని వరద బాధితులకు అండగా నిలిచారు. కాగా వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నారు. భారీ వర్షాలకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి చెరువు కట్ట తెగి జలమయం అయిన కాలనీల్లో పర్యటించారు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, వీరితో పాటు పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఉన్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్థానికులకు భరోసా ఇచ్చారు మంత్రులు.

- Advertisement -