సమ్మిళిత అభివృద్దే మా లక్ష్యం- కేటీఆర్‌

426
Minister ktr
- Advertisement -

ఈ రోజు హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌజ్ లో క్రిస్టియన్ మతపెద్దలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్,కొప్పుల ఈశ్వర్ ,రాష్ట్ర ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ బి.వినోద్ కుమర్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు ,సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశ ,రాష్ట్ర అభివృద్ధిలో క్రైస్తవ సమాజం పాత్ర చాలా ఉంది. నేను పుట్టింది మిషన్ ఆస్పత్రిలోనే. నేను ఏడు పాఠశాలలు మారినా ఎక్కువ కాలం చదువుకుంది మిషనరీ స్కూల్ లోనే అని కేటీఆర్‌ అన్నారు. క్రైస్త‌వ మిష‌న‌రీలు కొన్ని ద‌శాబ్దాలుగా విద్య‌, వైద్య రంగంలో ఎన‌లేని కృషి చేస్తున్నార‌ని కొనియాడారు. ఎక్క‌డ విప‌త్తులు సంభవించినా సేవ‌లు అందించ‌డానికి క్రైస్త‌వ స‌మాజం ముందు ఉంటుంద‌న్నారు. విప‌త్తుల వేళ కూడా విశేష సేవా, స‌హాయం అందిస్తున్నాయ‌ని మంత్రి పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ హిందూ ధ‌ర్మాన్ని బ‌లంగా న‌మ్ముతారు. అదే స‌మ‌యంలో ఇత‌రుల న‌మ్మ‌కాల‌ను కూడా గౌర‌విస్తారు. రాష్ర్టంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు. స్వ‌రాష్ర్టంలో ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు అభివృద్ధి చెందాయ‌న్నారు. అన్ని వ‌ర్గాల సంక్షేమ‌మే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం 940 గురుకులాలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ గురుకులాల్లో 5 ల‌క్ష‌ల మంది విద్యార్థులు చ‌దువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. క్రైస్త‌వ స‌మాజానికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

అభివృద్ధి అనేది స‌మ‌గ్రంగా, స‌మ్మిళితంగా ఉండాల‌నేది త‌మ అభిమ‌త‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. చైనా కంటే మ‌నం వెనుక‌బ‌డి ఉన్నామ‌ని తెలిపారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న లేకుండా ఎంత అభివృద్ధి జ‌రిగినా అది వృథా అవుతుంద‌న్నారు. ఇన్నోవేష‌న్‌ను ప్రోత్సహించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తెలంగాణ జీఎస్‌డీపీ ఆరేళ్ల‌లోనే రెట్టింపు అయింద‌ని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -