విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యత- మంత్రులు

45
ministers
- Advertisement -

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండకం చించొలి బి సమీపంలో రూ. 25 కోట్లతో నిర్మిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను సోమవారం రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డిలు పరిశీలించారు. పనుల గురించి అధికారులను, కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతను ఇస్తున్నదని.. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రులు అన్నారు. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ, అదనపు కలెక్టర్లు, హేమంత్, రాంబాబు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -