గురుకులల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి: మంత్రులు

238
Ministers
- Advertisement -

శనివారం సంగారెడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ గిరిజన లా కాలేజీని మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి. పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ రెడ్డి,గురుకుల సెక్రటరీఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లనే రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో మంచి విద్య లభిస్తుంది. సీఎం కేసీఆర్ కృషిని ప్రతి గురుకుల స్కూల్, కాలేజీలో విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాకముందు గురుకుల విద్యకు 70 కోట్లు మాత్రమే.. సీఎం కేసీఆర్ చొరవతో ప్రస్తుతం 570 కోట్లు బడ్జెట్‌ కేటాయించారు.తెలంగాణలో గురుకులలు గొప్ప పేరు తెచ్చుకున్నది సీఎం కేసీఆర్ ఆలోచన వల్లనే అని మంత్రి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం 570 కోట్లు గిరిజన విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తుంది. సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణలో పేద విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీ లను ప్రారంభించము. ప్రభుత్వం ఇచ్చిన అవకాశంను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. గురుకుల పాఠశాలల్లో, కాలేజీలలో అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని తప్పకుండా తల్లిదండ్రులకు చెప్పాలి. దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లా కాలేజ్ సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం సంతోషం ఉంది. దేశానికే ఆదర్శంగా సంగారెడ్డి రెసిడెన్షియల్ లా కాలేజ్ పేరు తెచ్చుకోవాలి అని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలి రెసిడెన్షియల్ గిరిజన లా కాలేజీ (మేన్స్) సంగారెడ్డిలో ఏర్పాటు చేసాము. సీఎం కేసీఆర్ చొరవతో గిరిజన విద్యార్థుల కోసం 22 రెసిడెన్షియల్ గిరిజన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసామని తెలిపారు. గిరిజన పిల్లల చదువుల కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నాము. ప్రభుత్వమే గిరిజన విద్యార్థుల కోసం ఐఎఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నది. బడ్జెట్ లో గిరిజన సంక్షేమం కోసం
2600 కోట్లు కేటాయించమని మంత్రి సత్యవతి తెలిపారు.

- Advertisement -