తెలంగాణ మొత్తం మల్కాపూర్ లెక్క మారాలి..

481
minister errabeli
- Advertisement -

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కా పూర్‌లో 200వ వారం శ్రమదాన కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ… 3 ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది.ఇంటి ఇంటి నల్ల పెట్టి సురక్షిత తాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Errabelli Dayakar Rao

ఇక అభివృద్ధిలో మల్కాపూర్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.తెలంగాణ గ్రామాలు మొత్తం మల్కాపూర్ లెక్క మారాలి.గంగదేవిపల్లిని మించి మల్కాపూర్ అభివృద్ధి చెందింది. మల్కాపూర్‌ను సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసిన గ్రామ యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. సీఎం కేసీఆర్ కలలను నిజం చేసిన ఘనత మల్కాపూర్ గ్రామనిదని మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మల్కాపూర్ గ్రామంలో 200 డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణలు చేస్తాము. మల్కాపూర్ గ్రామంలో త్వరలోనే ఇంటికి రెండు పడి పశువులు ఇస్తాము. అభివృద్ధిలో మల్కాపూర్ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -