టీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు పెద్దపీట వేసిందన్నారు పశు సంవర్దక, మత్స్య,సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ . మేడ్చల్ జిల్లా శామిర్ పేట మండలం అలియాబాద్‌లో గొల్ల కురుమలకు రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి.
ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే చేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం భారీగా రుణాలు అందిస్తుందన్నారు. స్వయం ఉపాధి పొందడానికి యువతను ప్రోత్సహిస్తోందన్నారు.
కార్మిక శాఖామంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. అందులో భాగంగానే గొల్ల, కురుమలకు ఉపాధి కల్పించేందుకు గొర్రెలను పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ ఎంవి రెడ్డి, MLC నవీన్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర,మేడ్చల్ జిల్లా TRS ఇంచార్జ్ శంభిపూర్ రాజు,జడ్పిటిసి అనిత, అలియబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్,జిల్లా వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.