వేద విద్యార్థుల మృతి బాధాకరం- మంత్రి వెల్లంపల్లి

66

కృష్ణానదిలో పడి ఆరుగురు వేద పాటశాల విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తెలిసిందే. ఈనేపథ్యంలో జీజీహెచ్‌లో వేద పాఠశాల విద్యార్థుల మృతదేహాలను ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. వారివెంట ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఉన్నారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కృష్ణానదిలో ఐదుగురు వేద పాఠశాల విద్యార్దులు, ఒక గురువు మృతిచెందడం బాధాకరం. స్నానానికి దిగిన సమయంలో నీటిలో పడిపోయిన ఒక విద్యార్దిని కాపాడే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. శృంగేరి పీఠం అధికారులతో మాట్లాడాను. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నామని మంత్రి తెలిపారు.