ఎస్సీ వర్గీకరణకు చట్టం..కాంగ్రెస్‌దే ఘనత: ఉత్తమ్

1
- Advertisement -

ఈ రోజు ఒక చరిత్రత్మాకమైన రోజు అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన ఉత్తమ్.. దశబ్దాలుగా ఎస్సి వర్గీకరణ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చిన వస్తావా రూపం దక్కలేదు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో చిత్తశుద్ధి తో వర్గీకరణ చేశాము అని.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఇంత చరిత్రత్మాకమైన నిర్ణయం లో తీసుకోవడం లో నేను ఉండడం అదృష్టం అన్నారు.

నేను ఎమ్మెల్యే అయినప్పటినుండి ప్రతి శాసనసభలో, పార్లిమెంట్ లో ఎస్సి వర్గీకరణ జరుగలని అన్ని పార్టీ లు, ప్రభుత్వాలు మాట్లాడేవి అన్నారు. కానీ ఈ రోజు ఒక పక్కడబంది ప్రణాళికతో ఎస్సి వర్గీకరణ చట్టం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది అని.. ఎస్సి వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది అన్నారు.

దళితుల దశాబ్దాల వర్గీకరణ కలను నెరవేరుస్తున్న మా నాయకుడు, విజినరీ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కేబినెట్ సబ్‌కమిట్ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌‌రెడ్డి కి, ఇతర సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు మంత్రి దామోదర రాజనర్సింహ. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలే రేవంత్ దార్శనికతకు నిదర్శనం అన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటి కాదు, స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏండ్లకే ఈ డిమాండ్ మొదలైందని.. వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయి అన్నారు.

Also Read:ఢిల్లీలో కాంగ్రెస్ డీసీసీల సమావేశం

ఎంతో మంది త్యాగాలు చేశారు.. వారందరికీ ఈ సందర్భంగా మాదిగ సమాజం తరపున నా కృతజ్ఞతలు, అమరవీరులకు జోహార్లు చెప్పారు. అమరుల ఆశయాలను, దశాబ్దాల మాదిగల ఆకాంక్షను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారు.. వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 6 నెలల్లోనే వర్గీకరణ చట్టం చేసుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్‌మెంట్‌, రేవంత్‌రెడ్డి కమిట్‌మెంట్ అన్నారు. 2025 ఫిబ్రవరి 4వ తేదీ(సోషల్ జస్టీస్ డే), మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయి… గతంలో ఓసారి వర్గీకరణ చేసినా, కోర్టు తీర్పులతో అది నిలిచిపోయింది అన్నారు. నాటి వర్గీకరణకు, నేటి వర్గీకరణకు పెద్దగా తేడా లేదు.. కేవలం 1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయి. మొత్తం మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమే కావడం గమనార్హం అన్నారు.

- Advertisement -