గో ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రాధాన్యం: మంత్రి తలసాని

62
talasani
- Advertisement -

గో ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి వరకు చేపట్టిన మహా పాదయాత్రను మంత్రి తలసాని హైదరాబాద్‌ లిబర్టీలోని టీటీడీ ఆలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని…గోమాతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం పెరిగిందని ….గో ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ, ఇతర సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -