ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి: తలసాని

1935
talasani
- Advertisement -

హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక భవన్‌లో జిహెచ్‌ఎంసి పరిధిలోని ప్రజాప్రతినిధులతో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కార్యక్రమంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఎన్నికలకు సంబంధించి 2017 ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధులు అందరూ తమ ప్రాంతంలోని గ్రాడ్యుయేట్స్ ని ఓటర్ నమోదు చేసుకునేలా క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.

వచ్చే నెల 6 వతేది వరకు అవకాశం ఉంది. మన పార్టీ నాయకులు స్థానిక జిహెచ్‌ఎంసి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి వేగవంతం చేయాలి. ఓటర్ నమోదు కాగానే టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌కు లింక్ పంపాలి. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మీ నియోజకవర్గ పరిధిలోని బస్తీలో,కాలనిలో ఈ ప్రక్రియ వేగవంతం చేయాలి. సర్టిఫికేట్లకు సంబంధించి గెజిటెడ్ సంతకం కోసం ఓటర్లకు సహాయం చేయండి అని అధికారులకు మంత్రి తలసాని సూచించారు.

- Advertisement -